Google Shades of my life: నేననుకునే "పవనిజం"

Friday, June 28, 2013

నేననుకునే "పవనిజం"


"పవనిజం" ఈ పదాన్ని పవన్ ఫాన్స్ రెండు రకాలుగా చెప్పుకుంటారు. కొందరు అదేపనిగా వాడటాన్ని ఇష్టపడరు, మరికొందరు ఈ పదాన్ని తమ ఇంటిపేరుగా వాడటానికి కూడా వెనుకాడరు. మరి నేనేమనుకుంటున్నాను? ...

మొదటగా నేను చిన్నప్పటి నుంచి గమనించిన కొన్ని విషయాలు చెప్తాను .

> మనిషికి ఏదయినా కూడా తనకి ఇష్టం వచ్చిన పనినే చెయ్యటానికి ఇష్టపడతాడు అది తప్పయినా కాని ఒప్పైనా  కాని .

> చేసేది తప్పయినా తమకు ఇష్టం వచ్చిన పని చేస్తే అది ప్రేమ అనుకుంటారు . అదే పని వేరేవాళ్ళు  చేసి తమకు నచ్చకపోతే అలా చెయ్యడం తప్పు అని ఎదుటివాళ్ళను అంటారు .

> తమకు మేలు జరిగితే అది దేవుడివల్ల జరిగిందని కీడు జరిగితే అది కూడా దేవుడే చేసాడని అనుకుంటారు ఆస్తికులు.

> అదే నాస్తికులయితే మంచి జరిగితే తమ కృషి  అని చెడు జరిగితే తమకు అన్యాయం జరిగిందని అనుకుంటారు .

> మంచి జరిగునపుడు దేవుడికి కోట్లు అయినా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు . చెడు జరిగినప్పుడయినా కూడా కోట్లు పెట్టడానికి కూడా వెనుకాడరు .

సో మనిషికి ముక్యంగా, ఏది ఏమయినా కాని తమకు మంచి జరగాలి....  . అక్కడ ఎవరు చేసారని చూజరు, మంచి జరిగితే చాలు. అది చేసినవాల్లనే దేవుడుగా భావిస్తారు .

"మనకు ముక్యంగా కావాల్సింది ప్రేరేపణ అది ఎవరు ఇచ్చారన్నది ముక్యం కాదు. ఆ ఇచ్హినవాన్నే మనం దైవంగా భావిస్తాము . "


ఇదే విషయాన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు "ఖలేజా" సినిమాలోనూ , క్రిష్ గారు " కృష్ణం వందే జగద్గురుం" సినిమాలోనూ  చెప్పారు .

"కళ్ళకు కనపడని దేవుడు మంచి చేసారంటే నమ్ముతారు చెడు చేసారన్నా నమ్ముతారు, చట్టపరంగా గుడులు కట్టి పూజిస్తారు . "

" ఒక మనిషి మన కళ్ళకు కనపడుతూ ,చెవికి వినపడుతూ ,తను చేసే పనులతో , నేను చేసే ప్రతి మంచి పనిలో ఆదర్శంగా నిలుస్తున్నప్పుడు నేనెందుకు ఒక మనిషిని దైవంగా భావించకూడదు?"

"కంటికి కనపడని వాళ్ళకి ఈ లోకం పెట్టుకున్న పేరు దేవుడు అయితే , కంటికి కనపడే ఈ దైవత్వానికి మేము పెట్టుకున్న పేరే . "పవనిజం " అని నేనంటాను.


No comments :