చాలా మందికి చదవకుండా పరేక్షల్ల్లో పాస్ అయిపోవడం, సంపాయించకుండా డబ్బులు రావాలనుకోవడం , స్కూల్ కి డుమ్మాకొట్టి ఇంట్లో ఉండిపోడం, ఇష్టమైన అమ్మాయి ఆమెకిష్టం లెకపొఇన మన పక్కన కూర్చునే సందర్భం రావడం.. ఇష్టం .
ఇవి కరెక్ట్ కాకపోయినా ఇవి ఇచ్చే ఆనడం చాల బాగుంటుంది. ఉండేది కొంచెం సేపే అయినా ఎప్పటికి గుర్తుండిపోతాయి ఈ మధురానుభూతులు.. రెండు రోజుల్లో పరీక్షలున్టాయ్ ఏమీ చదవలేదు అవన్నీ మరిచిపోయి ఎదో సంతోషంలో మునిగిపోతుంటాం ఒక్కోసారి . అలాంటి అనుభవమే ఎదురవ్తుంది మన హీరోయిన్ కి .
. హీరోయన్ కి తను చిన్నప్పుడు ఎదుర్కున్న అవాంచనీయ సంఘటనలు .... అకస్మాత్తుగా వాటిని మరిపించే క్షణాలు ఎదురవడం ఈ సినిమాలోని ముఖ్యాంశాలు.
హీరో విషయానికొస్తే తను చాల కటినాత్ముడని, కోపగ్రస్తుడని తనలో అనుకుంటాడు. తనలో కూడా ఏడ్చే ఒక మనసుందని ఒకమ్మాయి తన జీవితంలోకి వచిన్దాక తెలీదు.
ఇక ఈ ఇద్దరికీ తమ స్వభావాలు మార్చుకోగా ఆ విధంగా వాళ్లకి వచ్చే ఆనందాన్ని అనుభవాల్ని మనకు తెలియపరుస్తుంది ఈ సినిమా.
ఎక్కువ ప్రేమని మనం ఒక్కోసారి భరించలేం. దానివల్ల ఏమయినా ఇబ్బంది వస్తుందని కాదు కాని. జీవితంలో అనుక్షణం చస్తూ బ్రతుకుతూ ఐన గడపోచు కాని. కలవడం జరగదని తెలిసాక కూడా అనుబంధాన్ని కొనసాగించడంలో చాల భాద ఉంటుంది. ఆ భాదని హీరో గడపాలనుకోడు.
అమ్మలో అమ్మాయిని చూస్కుంటూ హీరో మదనపడే సీన్ చాలా బాగుంటుంది.అనుభవిస్తే కానీ తెలీదు.
స్వతహాగా ఈ సినిమాలోని సన్నివేశాలు నా జీవితానికి దగ్గరగా ఉంటాయి... సినిమా చాల చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది ఒక సంపూర్ణమైన సినిమా కాదనే చెప్పాలి... డాక్యుమెంటరి కి ఎక్కువగాను మామూలు సినిమాకి తక్కువగాను ఉంటుంది. మన భావాన్ని కలుపుకుని సినిమా చూస్తె అందంగా ఉంటుంది. సినిమాన్ సినిమాలాగే ఫీల్ అవ్వాలి మరీ ఎక్కువగా ఫీల్ అవ్వకూడదు అంటారు కొందరు కానీ.. ఈ సినిమాని బాగా ఫీల్ అవితేనే అర్ధం అవ్తుంది అవగాతమవ్తుంది... అలాగని సంక్లిష్టమైన సినిమా కాదనుకోండి. మొత్తానికి మంచి సినిమా . సినిమాని కేవలం రేకార్డులకోసమే కాదు మనలో ఉన్న ఒక కథకుణ్ణి త్రుపిపరిచేలా తీయాలి అనుకునే దర్శకుల్లో ఇంతియాజ్ అలీ ఒకరు. మీరు కూడా వెళ్లి చూడండి.
No comments :
Post a Comment