Google Shades of my life: రెహానే జబ్బర్ చనిపోయేముందు వాళ్ళ అమ్మకు రాసిన లేఖ

Thursday, November 27, 2014

రెహానే జబ్బర్ చనిపోయేముందు వాళ్ళ అమ్మకు రాసిన లేఖ


Reblogged content. 
Iriginally Written by Balu Mallik. 

ఇరాన్ దేశంలో 2007లో రెహానా అనే ఒక 19 సంవత్సరాల అమ్మాయిని ఒక కామాందుడు అత్యాచారం చెయ్యబోతే మాన,ప్రాణ రక్షణకై ఆ పశువుతో పెనుగులాడి,ప్రతిఘటించి కత్తితో పొడిచి వాడి ప్రాణం తీసింది.కానీ ఆ కామాందుడి తరపు న్యాయవాది తప్పుడు సాక్ష్యాలతో దానిని కోర్టులో సంకల్పిత హత్యగా చిత్రీకరించి ఆమెకి ఉరిశిక్ష పడేలా చేసారు.ఏడు సంవత్సరాలు జైలులోనే శిక్షని అనుభవించిన రెహానా 2014 అక్టోబర్ 25 న ఉరికంభం ఎక్కి ప్రాణాలు విడిచింది.ఆఖరి రోజులలో రెహానా తను గడిపిన,చూసిన మొత్తం జీవితాన్ని,ఎదుర్కొన్న సంఘటనలను,తన మరణాణంతర కార్యాచరణని తనకి జన్మనిచ్చిన తన తల్లికి ఒక లేఖ ద్వారా తెలియజేసింది.ఇది లేఖ కాదు రెహానా క్లుప్తంగా వ్యక్తపరచిన వాస్తవ జీవన రూపం, నిస్సారమయిన తన జీవిత సారం..

"అమ్మా ఈ రోజు నా జీవితంలో చివరి రోజు.ఈ ఆఖరి క్షణాలలో నీతో ఎన్నో చెప్పుకోవాలని ఉందమ్మా..నా భాధంతా మరణానికి చేరువవుతున్నందుకు కాదమ్మా..నువ్వు నా గురించి ఏడుస్తావనే ఆలోచనే నన్ను భాధిస్తుంది.అమ్మా ఈ ప్రపంచం నాకు 19 సంవత్సరాలు మాత్రమే బయట స్వేచ్చగా జీవించే అవకాశాన్నిచ్చింది.నేను విధిని నిందించడంలేదమ్మా..ఎందుకంటే ఆ భయంకరమైన కాళరాత్రి నేను ప్రతిఘటించకపోతే ఆ కామాందుడు నన్ను చంపి ఎక్కడో పడేసేవాడు.తర్వాత కొన్ని రోజులకి నా శవాన్ని గుర్తించడానికి నిన్ను నా శవం దగ్గరకి తీసుకొచ్చేవారు.నన్ను ఒకడు పాశవికంగా అనుభవించి ప్రాణాలు తీశాడని తెలిసి కూడా వాడి అధికారం,హోదా ల ముందు న్యాయం జరగక నువ్వు తల్లడిల్లి కొన్ని రోజులకి ఆ భాధతో మరనించేదానివి.దానికన్నా ఆ కామాందుడిని ఎదుర్కొని హతమార్చి ఇప్పుడు గర్వంగా ఉరికంబం ఎక్కుతున్నానమ్మా..ఎందుకంటే ఇప్పుడు నేను ఎంతో పవిత్రంగా నా దేహాన్ని విడుస్తున్నాను.నా శవాన్ని కూడా నీకు ఎంతో మర్యాదగా అప్పగిస్తారు.ఇదే నాకు గౌరవం కదమ్మా..అమ్మా నువ్వు చిన్నప్పుడు చెప్పేదానివి కదమ్మా ప్రాణం పోయినా కూడా విలువలని వదులుకోవద్దు అని,నేను నా విలువల కోసం ప్రాణాన్ని వదలబోతున్నానమ్మ..నీకు తెలుసు కదమ్మా నేను మన ఇంట్లో దోమలని కూడా చంపను,నాకెంతో భయమయిన బొద్దింకలని కూడా చంపకుండా తీసుకెల్లి బయట వదిలేస్తాను.అటువంటి నేను ఉద్దేశ్యపూర్వకంగా వాడిని హత్య చేసినట్టు కోర్టులో నమ్మించారు.అందం కోసం పెంచున్న నా చేతి గోళ్ళని కూడా మారణాయుదాలుగా వర్ణించి వాదిస్తే నేను నిర్ఘాంతబోయాను.నన్ను అసభ్య పదాలతో ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు ,నువ్వు ప్రేమించమని చెప్పిన మన దేశం,ప్రజలు ఎవ్వరూ నాకు ఆసరా ఇవ్వలెదమ్మా..నీకు ఒక విషయం చెప్తాను భాదపడకమ్మా,జైలులో ఒక ముసలి అధికారి పైసాచికంగా నా గోర్లని లాగి నన్ను భ్ హాధ పెట్టాడమ్మా..అప్పుడనిపించిందమ్మా అందం అంటే పైకి కనిపించేది కాదు కేవలం మచి ఆలోచలలే అని
నన్ను కాపాడమని కానీ,నాకు క్షమాభిక్ష కి అభ్యర్దించమని కానీ నిన్ను ఎప్పుడూ అడగలేదమ్మా నిన్ను కానీ నాకొక చివరికోరికమ్మా.. అది తప్పక తీర్చాలి..నీకు తెలుసు కదమ్మా చావు అనేది జీవితానికి అంతిమం కాకూడదని,అందుకే నా శవాన్ని చూసి నువ్వు ఏడవకుండా నేను చెప్పేది భాధ్యతగా నెరవేర్చు.నేను చనిపోయాకా నా గుండె,నా కళ్ళు,నా అవయవాలు ఈ మట్టిలో వ్యర్ధంగా కలిసిపోకూడదమ్మా.అవి అవసరమై ప్రాణాలతో పోరాడుతున్న వారికి వీటిని నా బహుమతి గా అందజెయ్యి.ముఖ్యంగా ఇంకొక విషయం "అందజేసిన వారిని నా గురించి ఎట్టి పరిస్తితిలో తెలియనివ్వకు.వారు నా కోసం పుష్పగుచ్చాలు కొనక్కర్లేదు,ప్రార్ధనలు చెయ్యక్కర్లేదు.ఈ ప్రపంచానికి నాతో పని లేదమ్మా,నన్ను కావాలని కూడా అనుకోలేదమ్మా,కానీ నువ్వు చెప్పినట్టు నా వంతుగా ప్రపంచానికి నేనిచ్చే చిరుకానుకమ్మ.ఈ లోకంలో అసత్యాలకి,ఎవరో రాసిన పుస్తకాలకి,ఈ కోర్టులకి నేను బలి కాబడి ఉండచ్చమ్మా..కానీ వేరే లోకమంటూ ఉంటే ఆ దేవుడి న్యాయ స్థానంలో నాదే గెలుపమ్మా..ఇక్కద అబద్దపు సక్ష్యాలతో నన్ను దొషిగా చేసిన ప్రతీ ఒక్కరిని ఆ దేవుడి ముంది దోషులుగా నిలబెడతానమ్మా..నా జీవితం కన్నా నాకు నువ్వే ఎక్కువమ్మా,నువ్వు భాధపడితే ఎక్కడున్నా నేనస్సలు తట్టుకోలేను.నువ్వు నల్ల బురఖా వేసుకోవద్దు.నేను పడిన భాధని అంతా మర్చిపొవడానికి ప్రయత్నించమ్మా.నువ్వు సంతోషంగా ఉంటే నీ నవ్వులలోనే నేను జీవించి ఉంటా.నువ్వు సంతోషంగా ఉండి నాకు మనశ్శాంతిని ఇవ్వు.
చివ్వరగా ఒక్క మాటమ్మా..ఎందుకో తెలీదు "నా ప్రాణాలు పోయేవరకు నిన్ను గట్టిగా హత్తుకుని ఈ జీవతకాలపు సేద తీరాలనుందమ్మా..జన్మనిచ్చిన నీ వొడిలోనే ఊపిరి వదలాలని ఉందమ్మా" i love you అమ్మా.--- నీ రెహానా జబ్బరి.

--------
అనువాదం :బాలు మల్లిక్ 
http://goo.gl/kfLvG0

No comments :