Google Shades of my life: "Kanche" Movie - My views

Saturday, October 24, 2015

"Kanche" Movie - My views



హిట్లర్ యొక్క దురహంకారాన్ని మన దేశంలో ఉన్న కుల వ్యవస్తకు ముడిపెట్టి., చెప్పాలనుకున్నది బాగా చెప్పాడు క్రిష్.
కానీ హిట్లర్ ని అభిమానించేవాళ్లున్నట్లే, తక్కువ కులానికి పెంపుడు జంతువులతో, అగ్రకులాల్ని అరణ్య మృగాలతో  పోల్చి కు.లం పై తమకున్న మమకారాన్ని ఇప్పటికీ చాటుకుంటున్నారు ఎక్కువమంది.
ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు సాధారణ మనిషి ఆలోచించడం మొదలు పెట్టాలి. ఎందుకంటే పదిమంది కలిసి చేస్తే  మంచి పనైనా,  చెడ్డ పనైనా  చట్టం దృస్టిలో చెల్లుబాటు అవుతుంది. దానికి ఈ మద్యే ఆవు మాంసం కలిగి ఉన్నాడనే నెపంతో గుంపు కలిసి అతన్ని తుదముట్టించడమే ఒక ఉదాహరన. అలాంటి దుర్మార్గపు పనులు కాదుకాని సమాజానికి మంచిపనులేమైనా చెయ్యొచ్చు. అప్పుడే మార్పు వస్తుంది. స్వతహాగా మనుషులకి పదిమంది ఏమి చేస్తే అదే మంచి అనిపిస్తుంది. పదిమంది కులం గురించి ఆలోచించడం మానేస్తే కులంలో మార్పు అదే వస్తుంది. కొన్ని సినిమాలు చూసి అక్కడే మరిచి పోవచ్చు. కొన్ని సినిమాలు చూశాక అప్పటినుంచి ఆలోచించడం మొదలు పెట్టాలి.

ఈ సినిమాలో అన్నట్టుగా మనం ఈ అనంత విశ్వంలో చుక్కలాంటివి మన ప్రతీకారాలు కోపాలు.. మనం పోతాము అని తెలిస్తే నలుగురికి కాస్త మంచి చెయ్యాలి. వాళ్ళు పోతారని తెలిస్తే జీవితం లో వాళ్ళకు గుర్తుండిపోయే జ్ఞాపకాలనివ్వాలి. అందరం ఏదొకరోజు పోవాల్సిందే. ఉన్నంతలో పక్కవాళ్ళ మొకంలో ఆనందం నింపే పనులేమైనా చెయ్యాలి.

నాటి నుంచి నేటిదాకా కుల నిర్మూలనకై పాటు పడుతున్న మహానుభావులందరికి వందనం అభివందనం.

 ఈ వినిమా చూసి కులాన్ని మరిచిపోవాలి అని ఆలోచించిన ప్రతీ ఒక్కరికీ మరోసారి వందనం.

No comments :