Google Shades of my life: పవన్ కళ్యాణ్ - రాజకీయాలు -- ఫాన్ గా నా పాత్ర

Sunday, March 2, 2014

పవన్ కళ్యాణ్ - రాజకీయాలు -- ఫాన్ గా నా పాత్ర

పవన్ కళ్యాణ్ ఒక పార్టీ స్టార్ట్ చేస్తున్నాడని వార్త వచ్చింది. సరే ఐతే మనకేంటి.?
ఒక పవన్ ఫాన్ గా మన అభిప్రాయాలు రక రకాలుగా ఉంటాయి.
వాటిల్లో కొన్నిటిని స్పృశిద్దాం.

1. యస్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి రావాలి.
2. వద్దు ఈ మురికి పాలిటిక్స్ లోకి పవన్ వద్దు.
3. పవన్ ఇష్టం. ఆయనతోపాటే మేము.
4. ఏమో

1. యస్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి రావాలి.



కొంత మందికి comfortable స్పేస్ లో ఎక్కువసేపు ఉండటానికి ఇష్టపడరు. కొన్ని కారణాల రీత్యా అందులో ఉన్నా కూడా . తమ గుణం అది కాదు కాబట్టి వెంటనే బయటకి రావడాని ఎదురు చూస్తుంటారు. నెలకి లక్ష రూపాయల  జీతం, హాయిగా నెల నేలా జీతం చేతిలో పడుతుంటుంది. కానీ తృప్తి ఉండదు ఒక్కసారిగా రెక్కలు కట్టుకొని నెలకి మూడు వేల రూపాయల జీతంతో అయినా ఒక త్రివిక్రంగారి దగ్గర పని చెయ్యాలి లేదా ఆయనలా  ఉండాలి అనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న చట్రాన్ని దాటి రావడానికి ఎక్కువ అడ్డంకులు ఉన్నప్పుడు బయటకి అంత త్వరగా రాలేము. బహుశా మన జీవితం అందులోనే ఉండిపోతుందేమో. 
                     పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుండి అందరు బ్రతికే జీవన విదానం కాకుండా మనకి ఇష్టం వచ్చినట్లు ఉండాలి అని, మంచిగా ఒక మనిషిగా ఉండాలని కాలు కంటున్డేవాడు. ఆ మార్గంలో తను ఒంటరి జీవితాన్ని కూడా అనుభవించాడు. దానికి తానెప్పుడు క్రున్గిపోలేదు. ఒంటరైపోతానని తనకి తెల్సు. జీవితంలో ఇది ఒక బాగమే అని తెలుసు. ఆశ నిరాశల మద్యలో ఊగిసలాడే తత్వంనుంది ఎప్పుడో బయటికి వచ్చాడు. తను నిస్వార్దమైన మనిషి. ఒక మనిషి మాటల్లోనే తెలుసుకోవచ్చు ఆటను ఎలాంటి వాడు అని. లోకాన్ని దాని భావాలకి దూరంగా ఉండి బ్రతకొచ్చు కాని మనలో ఎదో ఒక శక్తి మనల్ని మనలా ఉండనివ్వదు. మనల్ని ఎప్పుడు ప్రస్నిస్తూనే ఉంటుంది. నువ్వు అనుకున్న జీవితం ఇదేనా. నీకు తృప్తిగా ఉందా అని. ఎదుటి మనిషికి సమాధానం చెప్పొచ్చు కాని, అంతరాత్మకి సమాధానం చెప్పడం చాలా కష్టం. పవన్ కళ్యాణ్ తను అంతగా జనంలోకి రాకున్న ..ఎల్లప్పుడూ జనం గురించే ఆలోచించే మనిషి. అలాంటి మనిషి ఒక ప్రజా సేవకు పూనుకోవడం మంచి విషయం. ఒక ఫాన్ గా తను అనుకున్న పని సరిగ్గా జరగాలని కోరుకుందాం.


2. వద్దు ఈ మురికి పాలిటిక్స్ లోకి పవన్ వద్దు.



మనకి చిన్నప్పట్నుండి multiple choice answers అంటే ఇష్టం. సరైన సమాదానన్న్ని ఎన్నుకోడానికి మనకి 4 ఆప్షన్స్ ఉంటాయ్. అలా బ్రతకడం అలవాటు చేసుకున్న మనకి, ఒక గమ్యానికి రెండు మూడు దారులు తెలుసుకునే తెలివితేటలున్న మనకి , జనరల్ భోగి రద్దు అయిందని తెలిస్తే ఎ.సి. భోగిలో టీ.సి. కి కొంత డబ్బులిస్తే సరిపోతుందని తెలిసిన మనకి ... అవతలి వైపు ఎం జరుగుతుందనేది పట్టదు. బ్రతికేయ్యోచు మనకి ఆప్షన్స్ ఉన్నన్నాళ్ళు , ఒకటి కాకపోతే ఉంకొకటి. కొనగలిగే స్తితి ఉన్నన్నాళ్ళు మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. 
         కాని వెచ్చించలేని వాళ్ళ పరిస్తితి ఏంటి?. వందలో ఏ ఇద్దరో "అరె వాళ్ళ సంగతి ఎలా అని ఆలోచిస్తారు. మిగతా వాళ్ళకి అది పట్టదు. మన మనసు మనల్ని ఇబ్బంది పెట్టనన్నాళ్ళు మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ జీవితం మొత్తం ఇలాగె, నీలా నాలా అందరు అనుకుంటే రేప్పొద్దున ఆపద వస్తే ఉన్నదంతా ఐపోతే అందరు చేజాచేవల్లె కాని చేయ్యందిన్చేవాళ్ళు ఉండరు. మనం మన కళ్ళముందున్న ఎంత అన్యాయం జరుగుతున్నా కళ్ళు మూసుకుుని హాయిగా నిద్ర పోగలమేమో కానీ, కొంత మంది ఉంటారు ...వారికి నిద్ర పట్టదు. అందరు సంతోషంగా ఉండాలి అనుకుంటారు. వాళ్ళు వేరేవాళ్ళ ఆనందంలో వాళ్ళు ఆనందాన్ని వెతుక్కుంటారు. వేరేవాళ్ళు భాదలో ఉంటె వీళ్ళ కళ్ళు చేమరుస్తాయి... వాళ్లు సంతోషంగా ఉన్న కూడా చేమరుస్తాయి ఆనందంతో....


మన పవన్ కళ్యాణ్ కూడా అలంటి వాడే. ఎదో మంత్రి అయిపోదామనో లేక ప్రజల్లో గొప్ప పేరు సంపదిద్దామనో కాదు. తన తత్వం అలాంటిది. అందరు బాగుండాలి. అందరు కూడా ఉన్న వనరులతో హాయిగా ఉండాలి. తెల్సి అన్యాయం ఎవరికీ జరగకూడదు. నీకంటే నాకంటే ఇబ్బందుల్ని ఎదుర్కున్నాడు పవన్ . ఎక్కడ మురికి ఉందొ. ఎక్కడ అడ్డన్కులున్నాయో, ఈ రాజకీయం ఎలాంటిదో ఆయనకి తెల్సు. ఆయనకీ రాజకీయం కొత్త కాదు. కనీసం నీకంటే నాకంటే ఒక ముక్క ఎక్కువే తెలిసినందుకు నమ్మకంతో ఉందాం. అందాక ఆయనకి ఎలాంటి అడ్డంకులు రాకూడదని..ఆయన తీస్కునే ప్రతీ నిర్ణయం ఆయనకీ మంచి అనుభవాన్ని , ముందుకు వెళ్ళే నమ్మకాన్ని ఇవ్వాలని కోరుకుందాం.

3. పవన్ ఇష్టం. ఆయనతోపాటే మేము.




వీళ్ళతో ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే వీళ్ళు కూడా ఆలోచించాలి పవన్ ఎందుకల చేస్తున్నాడని...అలా చేస్తే మనలో కూడా ఈ సమాజానికి ఎదో చెయ్యాలన్న తపన మొదలవచ్చు.అప్పుడు మన ఇష్టపూర్వకంగా ఒక పని చేసినట్లుంటుంది. ఇష్టపడి చేస్తే ఏ పని అయిన ఆనందాన్నిస్తుంది.

4. ఏమో 




వీళ్ళు తమ సమయాన్ని కొంచం వెచ్చిస్తే మూడో రకానికి చేరువ కాగలరు.

గమనిక.: పైన చెప్పినవన్నీ కేవలం నా ఆలోచనలు మాత్రమె ..ఇవి మార్గ నిర్దేశకాలు కావు లేదా...మొత్తం పవన్ ఫాన్స్ యొక్క ఆలోచనల్ని ప్రతిబింబించవు.

జై హింద్
మల్లిక్

No comments :