Google Shades of my life: My Views on Pawan Kalyan and Pawanism ..

Sunday, October 14, 2012

My Views on Pawan Kalyan and Pawanism ..

My Views on Pawan Kalyan and Pawanism ....
--by Ashok Babu Kandula - http://goo.gl/xvkRd

ఇంకా రోజులున్నాయ్ అన్న బొమ్మ వెండితెర మీద చూసి లక్షలాది అభిమానులు చూసి తరించడానికి .....

నిజమే, అయినా నేను సినిమా మొదటి రోజు చూడలేను కదా! ఆ మాటకొస్తే పవనంటే ఒక పిచ్చి లా, ఒక రక్త సంభందీకుడిలా అభిమానించే లక్షల మంది అభిమానులలో చివరిగా చూసే వాళ్ళలో నే ముందు వరసలో వుంటాను! మరి నాకెందుకు అంత పిచ్చి!

ఎందుకంటే ఆయన Movie మొదటి రోజే చూడలేకపోయినా ఆ ఆనందం మొత్తం నా Orkut Friends Threads లో, Facebook Friends Shares లో, Celebrities Tweets లో చూస్తాను కాబట్టి!

అన్న అంటే పూనకం వచ్చే అభిమానుల నిండు హృదయాలతో కళకళలాడే సినిమా Theaters, సైకిల్ స్టాండ్ దగ్గర పహారా కాసే పిల్లోడి నుంచి నిర్మాత వరకు అన్న Movie ఆడినన్నాళ్ళు కళ్ళల్లో ఒక వెలుగు, ఎవరి ఒత్తిడి లేకుండా రాసే సినీ సమీక్షలు చూడచ్చు కాబట్టి ....

కేవలం తెర మీద అభినయించే పాత్ర కి ఇంత అభిమానమేంటిరా అని నాన్న దగ్గర నుంచి Anti Fans దాకా నేను చెడ్డీ వేసుకున్నప్పటి నుంచి అడుగుతుంటారు .... నిజమే, పాత్ర పరిధి మేరకు నటించి వెళ్తే అంత అభిమానించాల్సిన, ఆరాధించాల్సిన, ఆయన బయట చెప్పే మాటల కోసం పరితపించాల్సిన అవసరం వుండేది కాదేమో!

కానీ, నేను అభిమానిని కాదు! ఒక అనుచరుడుని, PAWANISM అనే వ్యసనానికి బానిసై ఆయన బాటలో నడవడానికి ప్రయత్నిస్తున్న ఒక భక్తుడని ....

ఎందుకంటే,

నాలుగు సినిమాలు ఒక నాలుగు రోజులు ఎక్కువ ఆడితే, నా అంతటోడు లేడు, రాడు అనే ఈ రోజుల్లో సినిమా BOX OFFICE Records అన్నీ బద్దలు కొడుతుంటే ఒక మౌనిలా మొక్కలు నాటుతున్న నిగర్వి!

హీరోకి సకల సౌకార్యాలు కావాలని డిమాండ్ చేసే పిల్ల హీరోల మధ్యన షూటింగ్ లో వాళ్ళతో పాటే నేను .... వాళ్ళకేమి వడ్డిస్తున్నావో నాకు కూడా అదే వడ్డించు అనే నిరాడంబరత

నా హీరోలు ఎక్కడ Functions కి వచ్చి ఇబ్బంది పడతారో అని Functions యే వద్దన్న రియల్ హీరో !

ఎక్కడన్నా అన్యాయం జరిగితే తనకి జరిగిందని బాధ పడుతూ, తనకి తోచిన సాయం చేసే ఒక మానవతావాది.

చేసిన చిన్న సాయానికి జబ్బలు చరిచి, ఫోటోలు దిగి గర్వంగా డప్పు కొట్టుకొనే ఈ రోజుల్లో సాయం పొందిన వారు చెప్తే తప్ప తెలియని విధంగా సాయం చేసి సాయానికి, కృతజ్ఞత కి ఖచ్చితమైన భాష్యం చెప్పే పెద్ద మనిషి!

నాలుగు మాటలు మీడియా లో తప్పు గా రాగానే తప్పు తమదైనా పరువు నష్టం దావా వేస్తామంటూ అతిగా మాట్లాడే పెద్ద మనుషులున్న ఈ రోజుల్లో ... మీద ఎన్ని కొత్త కధలు వండి వార్చినా, ఎంత అణగదొక్కాలని ప్రయత్నించినా తొణకని, బెణకని మౌని ...
నా యుద్ధం కొందరి వ్యక్తుల మీదో, లేక ఒక వ్యవస్థ మీదో కాదు .... నా మీద నేను నిత్యం చేసే యుద్ధం అంటూ తనని తాను ముందుగా ఆత్మ పరిశీలన చేసుకునే నిజమైన దార్శనీకుడు ....

మాట మీద నిలబడే నిబద్దత,
తనకి న్యాయమనిపిస్తే దేనిపైనైనా ముక్కుసూటి గా మాట్లాడే నిర్మొహమాటం,
లక్షల మంది వ్యతిరేకించినా తాను నమ్మిందే చేసే గుండె ధైర్యం,
కొత్త వారిని ప్రోత్సహించే దమ్ము,
పుస్తకాలంటే పిచ్చి,
మనిషిపై నమ్మకం,
అభాగ్యులంటే ఆర్తి,
ఆడవారన్నా, పెద్దవారన్నా గౌరవం.....

ఇంకేమి లక్షణాలు కావాలి ఒక వ్యక్తి మీద అభిమానం పెంచుకోవాడానికి?

అందుకే ఆయన ఆశయ సాధనలో మేము సమిధులం....

ఆయనను నిజంగా అనుచరించిన నాడు,
మన ద్వారా సమాజానికి ఒక గొప్ప మేలు జరిగిన నాడు,
పవన్ అభిమాని అంటే ఒక శ్రేయోభిలాషి అని సమాజం గుర్తించిన నాడు ....

Pawanism అంటే నిజమైన అర్ధం దొరుకుతుంది ....

@ ఆశోక్ రాజ్

No comments :