Google Shades of my life: Real Anantha Puram 1980

Saturday, March 17, 2012

Real Anantha Puram 1980

నిజమైన అనంతపురం సినిమాలోని సంగటన ఇటీవల హైదరాబాద్ పరిసరాల్లో జరిగింది . ఒక సాఫ్ట్ వేర్  ఇంజనీర్ ని కిరాతకంగా చంపేశారు అమ్మాయి తరపువాళ్ళు. అమ్మాయి అబ్బయిఒ ఇంటర్నెట లో ప్రేమించు కున్నారు. అబ్బాయిని బెదిరించాడు అమ్మాయి తరపు వాళ్ళు . వాటికి బయపడని సదరు ప్రేమికులు తమ ప్రేమను కొనసాగించారు.
                       ఇదిలా సాగుతుండగా అమ్మాయి తండ్రి మరియు వాళ్ళ స్నేహితులు ఒక పధకం పన్నారు. AP1980 బాగా వంటబట్టిందేమో అచ్చు అలాగే అమ్మాయిని ఉపయోగించి పధకం పన్నారు. అబ్బాయిని హైదరాబాద్ రప్పించారు. అక్కడికక్కడే అబ్బాయిని కిడ్నాప్ చేసి మారు మూల ఆప్రాంతానికి తీస్కెళ్ళి చంపేశారు. చాపి కిరాతకంగా తగులబెట్టారు.  పోలీసులు చెప్పినదాని ప్రకారం 
                          సో ఇది జరిగిన విషయం. పైన రాసింది చదివి చాలా మంది అభిప్రాయం చాల రాకలుగు ఉంటుంది. మచుకు కొన్ని.
1. మంచిగా జరిగింది చెప్పింది వినొచ్చుగా, వార్నింగ్ ఇచున్పపుడే వినిఉంటే ప్రాణాలమీదకు వచేది కాదు. ఐనా ఈ ఇంటర్న్తేట్ ప్రేమలు ఇలానే ఉంటాయి.
2.  అమ్మాయిలను నమ్మకూడదు రా న్బాబు.
3. ఎందుకు చెప్పు ఇవన్ని హాయిగా తల్లిదండ్రులు చూపించిన అమ్మాయిని చేస్కోక.వందలమంది అమయిలు ఉన్నారు లోకం లో .వాళ్ళ తల్లి దండ్రులని కూడా బాదపెట్టాడు.
చాల తక్కువమంది అనుకునేది నేను రాస్తున్న చదవండి......
                          .. అసలు దీనికంతటికి కారణం ఏంటి. తమ కూతురు ఏ జులాయి వెధవని ఇస్తాపద్తుండా., లేకుంటే తను చేస్కుంటుంది ఎదిఅన రౌడీ వెధవనా ...కానే కాదు .అంత చదువుకున్న అమ్మాయి ఆ పనెందుకు చేస్తుంది?
ముక్యంగా తల్లి దండ్రులు ఈ అమ్మాయిని పలాన వారికి ఇవ్వాళా లక్షల ఆలోచనలు పెట్టుకుని ఉంటారు. తమ అంతస్తుకు, కులాని తగ్గట్టు ఒక అబ్బాయిని చూస్తారు, లేదా  చిన్నప్పుడు ఎవరికో(అక్క, చెల్లి, తమ్ముడు etc ) ఇచిన మాటకు కట్టుబడి సంబంధాన్ని అంట గట్టాలని చూస్తారు. చాల మంది అంటారు అమ్మాయి మోసం చేసిందని. కానే కాదు. అమ్మాయిల మైండ్ అలానే ఉంటుంది. తమ చేతిలో ఉన్నంత వరకు బాగానే ఉంటారు. పరుత్తివీరన్ సినిమాలో హీరోయిన్ లాగా ఉండరు అందరు అమ్మాయిలు. పెద్దలందరూ దీనికి చెప్పే సమాదానం ఒకటే మా పరువు ఎం కావాలి అని.. అసలు పరువు అంటే ఎంటండి....పరువుకి అర్ధం తెలుసా ఈ సో called పెద్దలకి. తమ కులం పెద్దదని పెద్ద కులం వాళ్ళని ఇవ్వాలని చూస్తారు అదేన పరువు...డబ్బు ఉంది కదా అని డబ్బున్నవల్లకే ఇవ్వాలని చూస్తారు ...ఇదేనా పరువు అంటే...
                       నా దృష్టిలో పరువు పోయినప్పుడు కంట నీరు రావాలి ....కళ్ళలో కోపం కాదు...నా దృష్టే పరువు పోయే సందర్బాలు చెప్తాను.
1. కాళ్ళ ఎదురుగ కళ్ళులేని వాడు దానం అడిగితే మొకం చతెస్కుని వెళ్తాం చూడు అప్పుడు మన పరువు పోయినట్టు.
2. మన తోటి స్నేహితుడిని ఇంకొకడు అవమానిస్తుంటే మనమూ వాళ్ళతో కలిసి నవుతము చూడు అపుడు పరువు పోయినట్టు.
3. ఇష్టమైన అమ్మాయి నోర్రర ఐ లావ యూ అని చెప్తే ఫ్రెండ్స్ ఏమనుకుంటారో అని తెలియనట్టు నటిస్తాం చూడు అప్పుడు పరువు పోయినట్టు.
......................
                      మనోళ్ళు తాగుడికి , సిగారట్టే కి బానిస అయినట్టు పరువుకి బానిస అయ్యారు. 
                      సో ఇంత చెప్పవ మరి మమ్మల్ని ఎం చెయ్యమంటావ్ అని మీరు నన్ను అడగోచు చెప్తా వినండి. మీ పేరు వెనుక ఉన్న ఆ తోకల్ని కత్తిరించండి. ఇంటి పేరు ఒకటి చాలు నిన్ను నన్ను గురిన్చిఒ తెలుసుకోడానికి. అది ఉన్నప్పుడల్లా మీకు ఒక ఆహాన్బావం ఉంటుంది నేను గొప్ప అని. అందరిలో ఒకడిలా మేలుగుదాం. మిగతా వారికీ మనకి మనం చేస మంచిపనుల్లోనే తేడ ఉండాలి ఇంకెక్కడా కాదు.
                                                                                             -- మల్లిక్