Google Shades of my life

Sunday, June 5, 2016

"A... AA" Movie - my views




పరువు పరువు పరువు
ఈ పదాన్ని ముఖ్యంగా చేసుకుని చేసిన సినిమా ఇది. 

బాగున్నవి 
1. ఛాయాగ్రహణం 
2. హీరోయిన్ సహపాత్రలో నటించిన  కళాకారిణి మాటలు 
3. రావు రమేష్ మాటలు
4. పాటల అమరిక 

పరువు గురించి గొప్పగా చోపించారు. దాన్నే కథాంశంగా చోపించారు. నా మాటకొస్తే పరువుకు ఇంతటి ప్రాముఖ్యత ఇవ్వనవసరం లేదు.  కథలో వల్లి పాత్ర కొత్తగా ఉంటుంది . ఆ కాస్త ముఖ్యత ఇచ్చి ఉంటే బాగుండేది . అనసూయ హీరోని ప్రేమిస్తుంటుంది . అని కథకుడు చెప్పలనుకుంటాడే  కానీ ఎక్కడా కూడా ఆ ప్రయత్నం చేసినట్లు కనపడదు .  ఒక సన్నివేశంలో ఒక మాట ఉంటుంది . అనసూయ అంటుంది . 
" వల్లి అలా కళ్ళతో చూసిన కూడా నీకు అర్ధం అవుతుంది కాని నేను ఎంత అరిచినా నీకు అర్ధమవదు. అది నిజం ప్రేక్షకులకు కుడా అలానే అనిపిస్తుంది . సమంతా పేరున్న హీరోయిన్  కాబట్టి అలా జరగడమే  న్యాయం కూడా . కానీ ఒక సినిమా ప్రేక్షకుల హృదయాల్లో అలా నిలిచిపొవాలంటే హీరోయిన్ పేరు కంటే పాత్ర ముఖ్యం . సమంతా ప్రేమ కంటే వల్లి ప్రేమనే ఎక్కువేమో అనిపిస్తుంది . ప్రేమమ్  సినిమా చోసాను కాబట్టి ఆమెకి పేరొచ్చింది కాబట్టి నేను కూడా ఆ కోణం లో ఆలోచిస్తున్నాను అని మీరనుకోవచ్చు . నిజమే అలాంటప్పుడు ప్రేక్షకులను ఒప్పించాలి కదా . ఏ విషయం లో వల్లి కంటే అనసూయ గొప్ప అనేది చూపించాలి కదా . అది చూపించలేదు . వల్లిని నెగెటివ్ కోణంలో చూపించినంత మాత్రాన వల్లి ప్రేమ తక్కువైపోదా  కద.  ఈ విషయంలో ప్రేక్షకులను ఒప్పించి ఉంటె బాగుండేది . ఇప్పటికి వల్లి ప్రేమనే  ఎక్కువని నాకనిపిస్తుంది . 

ఇక ముక్య కథాంశానికి వస్తే పరువు అంత ముక్యం కాదు ఇప్పుడున్న సమాజంలో . మన తప్పు కానప్పుడు పరువు అనేది మాటకు రాదు. ఈ కాలంలో  కూదా పరువుకు ముఖ్యతనిచ్చి కధకుడు ప్రేక్షకులకి చెప్పాలనుకున్నాడో అర్ధం కాదు . ఆ విషయానికి భలాన్ని ఇవ్వడానికి నదియా ని నెగెటివ్ గా చూపిస్తారు 

కొన్ని గమనించాల్సినవి 
1. హీరో తండ్రి సుట్ కేసు వాళ్ళ భార్యకు ఇవ్వకముందే  దాంట్లో ఎదుటివాళ్ళ గెలుపు కోసం మనమీద నమ్మకం పెట్టుకున్నవల్లని ఓడించాకూడదు అని రాస్తాడు . 
2.  ఒక గొప్పింటి అబ్బాయిని అంట త్వరగా ఒప్పించడం అంట తేలిక కాదు.  కానీ దాన్ని చాలా తేలికగా చూపిస్తారు హీరోయిన్ చెల్లెలి విషయంలో . 
3. హీరో , వాళ్ళ ఆస్తి గురించి తెలిసి కూడా మరు మాట్లాడకుండా తన కూతురి మీద ప్రేమతో పెళ్ళికి ఒప్పెసుకుంటాడు రావు రమేష్ కాని, చివరి ఫైట్ సన్నివేశం లో చంపెయ్యమని పురమాయిస్తాడు తన మనుశులని. ప్రాస కోసం వాడేసారు కానీ కథాపరంగా అది అతకదు .  
4. వల్లి ఇంకా వాళ్ళ భావమీద ప్రేమ పోగొట్టుకోలేదు అని తెలిసాక నెగెటివ్  గా మాట్లాడతాడు రావు రమేష్ . ఇది కూదా అతకదు . 

కథా పరంగా శ్రద్ద తీసుకుంటే బాగుంటుంది . 

Monday, January 18, 2016

"Naannaku Prematho" - My Views

"రాజా రాణి నేపధ్య సంగీతం విన్నాక నా మనసు మంచి ఫీల్ తో ఉంటుంది...  ఆ ఫీల్ పోకముందే ఇష్టమైన అమ్మాయికి మనసులోని మాట చెప్పాలని I Love You చెప్తే...  అటునుండి సమాధానం రాదు..."   ఇది గుర్తు పెట్టుకోండి,  మళ్ళీ మాట్లాడుదాం దీనిగురించి.



సినిమా విషయానికొస్తే...
ఇంగ్లాండ్ లో ప్రసిద్ది చెందిన ధారావాహిక షెర్లాక్ హోమ్స్ ఆధారంగా సుకుమార్ హీరో క్యారక్టర్ డిజైన్ చేసారనిపిస్తుంది. అందుకే కాబోలు ఇంగ్లాండ్ లోనే చిత్రీకరణ జరిగింది.

ఇంటర్నెట్ ఇంటర్నెట్ లో రివ్యూలు చదివి ఈ క్యారెక్టర్ యం. టి. ఆర్ కి సెట్ కాదు అనుకున్నాను. కానీ  సరిపోయింది. తనకున్న నటనానుభవం కూడా పూర్తిగా పాత్రకు ప్రాణం పోసింది. వేషధారణ కూడా సరిపోయింది.

గమనిక: ఇక్కడ నుంచి కథ గురించి మాట్లాడటం జరుగుతుంది.

తండ్రి ప్రతీకారాన్ని పుత్రులు ఎలా తీర్చారనేది కధాంశం. హీరో పాత్రని తెలివైన యువకుడి' గా చిత్రీకరించారు. ఆవిధంగా వచ్చే సన్నివేశాలతో ప్రేక్షకులని కట్టి పడేయాలనుకున్నారు సుకుమార్. కొంత వరకు సఫలీకృతులయ్యారనే చెప్పాలి.

పాత్రల గురించి.
యం.టి.ఆర్ పూర్తి న్యాయం చేసారు. రకుల్ ప్రీత్ సినిమాకి తానే డబ్బింగ్ చెప్పింది. ఒక యన్. ఆర్ఐ మాతృ భాష మాట్లాడితే ఇలా ఉంటుందని చెప్పడానికి కాబోలు ఇలా చేసారు.  అందంగా ఉంది. డబ్బింగ్ సరిపోయింది. జగపతిబాబు బాగాచేసారు.

ఇలా తీసి ఉంటే బాగుండేది.
మొదటగా ప్రేమతో ప్రతీకారం ఎక్కడా అబ్బదు. ప్రేక్షకులు ఇక్కడ అంగీకరించకపోవచ్చు. తండ్రి మీద సానుభూతి ఏర్పడదు.  పెద్ద విషయం కాదిది.  D అంటే దివ్య అంటాడు మళ్ళీ మళ్ళీ అదే చెప్తాడు. ఆకరికి కూడా అదే చెప్పి ఉంటే బాగుండేది. అలా చేసుంటే హీరోయిన్ మీద ప్రేమతో ఉన్నట్టు నిజాయితీ గా ఉన్నట్లు కలిసొచ్చేది. ఇద్దర్ని తెలివిగా చూపిచ్చారు బాగానే ఉంది కానీ హీరోయిన్ ని కూడా తెలివిగా చూయించేసరికి ప్రేక్షకులకి ఓపిక పోతుంది. పాటలు సినిమాలో స్క్రీన్ ప్లేని అయోమయం చేసేలా ఉంటాయి.  పాటలు అవసరం లేదీ సినిమాకి. డాన్స్ బాగా చేసాడనుకోండి. రొటీన్ స్టెప్స్ లేవు.

మొదటకొస్తే నా ప్రేమ నిజం కావచ్చు కానీ ఆ అమ్మాయ్ కూడా అలా రాజారాణి వింటుండాలి కదా నేనేం అనుకుంటున్నానో, ఎలా ఫీల్ అవుతున్నానో తెలియాలంటే. నా శక్తి ఉన్నంత వరకు ప్రయత్నిస్తాను తెలియజేయడానికి. నేనిలానే ఉంటాను నా ప్రేమ ఇలానే ఉంటుంది. ఒకరోజు నీకు తెలిసి రావచ్చు. సుకుమార్ మంచి సినిమాని తీసారు తనకది తెలిసు , అర్దం చేసుకున్నవాళ్ళకు తెలుసు. అలాంటి సినిమాలు చూడాలంటే మనం సుకుమార్ పనితనం అర్థం చేస్కోవాలి. కాదు గీదు అనుకున్నా ఎవరో ఒకరు తనకి వస్తారు, మంచిగా చూస్కుంటారు. కానీ నాలా చూసుకోలేరు. ఎందుకంటే నేను చాలా బాగా చూుకుంటా. కావాలంటే సాధారణ సినిమాలకి మీ 100 రూపాయలు వెచ్చించవచ్చు. అద్భుతమైన అనుభవం పొందాలంటే అదే వెలలో నాన్నకు ప్రేమతో' సినిమా ఉంది.  తెలుగు సినిమా స్థాయిని పెంచే ప్రయత్నంలో సుకుమార్ గారు ఉన్నారు. వీలైతే భాగం పంచుకోండి. పంచుకోకున్నా పర్లేదు ఎందుకంటే కొన్నిటిని మనం ఆపలేం మన ప్రమేయం లేకుండా జరిగిపోతుంటాయ్.

Sunday, January 3, 2016

"Nenu Sailaja" - My Views



మామూలుగా' మనం టీవీ లో మంచి ట్రైలర్స్ చూసినప్పుడు ఆ సినిమా బాగుంటుంది కచితంగా హిట్ అవ్వాలని అనుకుంటాం. అలాంటి మంచి ట్రైలర్స్ లో నేను శైలజ కూడా ఒకటి.
+
మాటలు
రామ్ నటన
కొత్త నటి కీర్తి
పాటలు
-
హీరోయిన్ మేకప్, వస్త్రాలంకరణ
నేపధ్య సంగీతం

సినిమా గురించి:
పెద్ద హీరోలకి , బ్రహ్మానందం కి తప్ప ప్రేక్షకులు ఈలలు వెయ్యరు. అలాంటిది ఈ సినిమా మొదలు అవుతుండగానే ఈలలు వెయ్యడం చూసి ఆశ్చర్యం వేసింది. బహుశా వాళ్ళు ఫాన్స్ లేదా అంతకుముందే సినిమా చూసినవాళ్లు అయుండవచ్చు. సినిమాకి ముక్యంగా మాటలు చాలా ముక్యం అవి ఈ సినిమాలో లక్షనంగాను పుశ్కలంగాను ఉన్నాయి. మాటలు ఉన్నాయి కదా అని ఎడాపెడా గాలి ఆడకుండా వాడేయ్యకూడదు. ఈ మధ్యే వచ్చిన ఒక సినిమాలో అలాపెట్టి బోర్ కొట్టించారు. కాని ఈ సినిమాలో సందర్భానుసారంగా వాడారు. ప్రతీ తరం లొనూ యువత ఉంటుంది. అప్పట్లో మేము 20 లలో ఉన్నరోజుల్లో వినేవాళ్ళం ఇలాంటి మాటలు. ఇప్పటికి అవి ఆకట్టుకునేలాగే ఉన్నాయి. స్క్రీన్ ప్లే ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించారు. మల్లి కలిసుందాంరా రోజులు ఒక్కసారిగా గుర్తుకు వచాయి. ఎక్కడా అసభ్యంగా లేకుండా సున్నితమైన అంశాలను మంచిగా తెరకెక్కించారు. అక్కడక్కడ వచ్చే పాటలు సినిమాకు అదనపు ఆకర్షణ. హీరోయిన్ చాలా బాగుంది కానీ ఆమెకు వేసిన మేకప్ చూడ్డానికి బాలేదు. ఎక్కడైతే ఆమె లిప్స్టిక్ వేస్కోదో అక్కడ బాగుంది. స్వతహాగా అందం ఉన్నప్పుడు మేకుప్ వాడాల్సిన అవసరం లేదు. హీరోయిన్ ఆకృతికి తగ్గ దుస్తులు వాడితే బాగుండును అనిపించింది. పి సి శ్రీరాం గారు పనిచేసే ఒక సినిమాలో ఆమె ప్రధాన తారాగణం. ఆమెను మరొక తెలుగు సినిమాలో చూడాలనుకునే దర్శకులు ఆ సినిమాని గమినిస్తే బాగుంటుంది. రంగుల ఎంపిక కూడా సరిగ్గా లేదు. దేవిశ్రీప్రసాద్ నేపధ్య సంగీతం విషయం లో అక్కడక్కడా తడబడ్డాడు. కాని ఫర్వాలేదు అనిపించాడు.

మొత్తానికి చాల రోజుల తర్వాతా ఒక మంచి సినిమా తెలుగు లో చూశానన్న ఆనందం కలిగింది.