Google Shades of my life: Atharintiki Daredi my "Views"

Tuesday, October 8, 2013

Atharintiki Daredi my "Views"



సినిమా రిలీస్ కాకముందు:

1. ఏముందిలే త్రివిక్రమ్ ఐనా గట్టేక్కిస్తాడు. సో ఎట్టి పరిస్తుతుల్లో కూడా సినిమా గురించి తడబడే సమస్య లేదు.
2. సిటీ సెంటర్లో ఫోటోలు నెట్లో పెట్టేసారు, ఇక  ఏమైనా ఇంటరెస్ట్ ఉంటుందంటావా అనుకున్నాను.
3 . తెలిసిన ఫ్రెండ్స్ కొందరు సినిమాని , రిలీస్ కాకముందే ఆకాశానికెత్తేశారు . ఎన్ని సినిమాలకి ఇలా అనలేదులే  అనుకుని గమ్మునున్నాను.
4. సినిమా రిలీస్ కాకమునుపే  డైలాగ్స్ వచ్చేసాయి, మూవీ రిలీస్ ఆలస్యం అవుతుంది, ఉద్యమాలవల్ల ఏమీ చెయ్యలేని పరిస్తితి . సినిమా  మొత్తం వచ్చేస్తాదేమోనని భయం.

కొన్ని రోజులయ్యాక పరిస్తితి.

అనుకున్నట్టుగానే సినిమా వచ్చేసింది మార్కెట్లోకి ,కానీ  కనీ వినీ ఎరుగని ఘోరమైన పైరసీ రూపంలో.
అకస్మాత్తుగా ఎవరో చేతుల్లోంచి రేపు రావాల్సిన విజయాన్ని లాక్కున్నట్టు .....
ఓర్వలేని వాళ్ళు తమ కసినంతా చూపించినట్టు....
ఒక్కసారిగా అచేతనం అయిపొయింది మనసంతా.....

నన్ను నాలోనే ఓదార్చుకుని ఏమీ చెయ్యలేం అని తెలిసికూడా ఏదైనా చెయ్యాలి అనే మొండి పట్టుదలతో ఇంటర్నెట్ లో కల్లుపడ్డ చోటల్లా రిపోర్ట్ చెయ్యడం మొదలు పెట్టాం .
సినిమా ఇప్పుడే వస్తే బాగున్ను కదా అనుకుంటూ ఆ రెండు రోజులు గడిపాం.

అసలే ఇంటర్నెట్ పుణ్యమా ఇంత ఘోరమూ జరిగింది ఇక ఏ ఘోరాలు చూడోద్దనుకుని రెండు రోజులు ఇంటర్నెట్ కి దూరంగా ఉన్నాను.

---ఆ రోజు 27 సెప్టెంబరు. 

సమంతా ముఖంతో మాటలతో  సినిమా మొదలయ్యింది. బహుశా శకునం మంచిదనేమో. సమంతా మాట్లాడ్తుంటే ఆమె మాటలు గమనించకుండా  "ఇంత మంచి సినిమాని ఎలా పైరసీ చేసారురా అని నాలో నేనే మళ్ళి భాదపడ్డాను "
సమంతా ముఖం చూసయినా వాళ్ళు ఈ ప్రయత్నం విరమిద్దాం అనుకోలేదేమో.

మనసు కుదుట పరుచుకుని సినిమా పైన ద్రుష్టి మరల్చాను. సందర్భం అలా ఉందనేమో మూవీకి బాగా కనక్ట్ అయ్యాను.

సమంతా అక్కడ నందా అనే ఫామిలీ ఉంటుంది అన్నప్పుడు వెనుక బ్యాక్ గ్రౌండ్ మూసిక్ చాల బాగుంటుంది. అక్కడే అర్ధం అవ్తుంది మనల్ని కరిగించడానికి త్రివిక్రంగారు అంత అంతస్తుకు తీసుకుపోతున్నరేమో  అని. మన దేహం ఒక మంచుకుక్కితే అక్కడ ఆ సన్నివేశంలో వినిపించేమాటలు దృశ్యాలు మనల్ని నిలువెల్లా కరిగించేలా చేస్తాయి . ఆ పెద్దాయన మొకంలో ఎదో లోటు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ భాదని వాళ్ళ మంచితనాన్ని ఒక సంగీతంలా దేవిశ్రీ ప్రసాద్ మాటలు ఆకక్ర్లేకుండానే వాళ్ళ భావాల్లో చూపిస్తాడు.

పెద్దాయన నెరిసిన గడ్డంలో కూడా సెంటిమెంట్ కనిపిస్తుంది. క్లైమాక్స్ లో తన కూతురు తిరిగి వచినప్పుడు చిన్న పిల్లాడి ఏడుస్తాడు. వెక్కి వెక్కి ఏడుస్తాడు చెప్పాలంటే. భాద పశ్చాతాపం కలగలిపి కన్నిల్లల జారుస్తాడు.

నా కోరిక తీరుస్తావా అన్నప్పుడు ఫాన్స్ నుంచి స్పందన ఒకటే ఎందుకు తీర్చలేడు అని. అందరు గట్టిగ హర్షద్వానాలు పెడుతుండగా మొదటి పాట వస్తుంది. ఈ పాటలో హీరో కర్తవ్యాన్ని రచయిత చెప్తాడు. అలాగే ఈ పాటలో ఇంకొక చిన్న కథను త్రివిక్రంగారు పొందు పరిచారు. పాటంటే ఎదో మామూలుగ తీయకుండా గమనించే కొంది కొత్త విషయాలు తెలుస్కునే విదంగా ఉంటుంది ఈ పాట.

ఆ తర్వాత  మొదటిసారిగా హిరో అత్తవారింటికి వెళ్ళినప్పుడు అక్కడి సునంద అనే పేరుని తడిమి తన మనసు పదిలపరుచుకున్న మధుర క్షణాలను  నెమరు వేసుకోవడం గుండెలకు హత్తుకునే విదంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కి తన అసిస్టంట్ దుస్తులు, పాదరక్షలు అందించే సన్నివేశం ఒక దేవుణ్ణి భక్తితో పూజించిన చందానే ఉంటుంది .

అత్త
అత్తగారు నడిచేటప్పుడు ఒక స్టైల్ ఉంటుంది. ఆ నడకలో నేనెప్పుడు తప్పు చెయ్యలేదు అనే గర్వం ఉంటుంది. చూసేవాల్లు తమకు తెలియకుండానే చేతులెత్తి నమస్కరించేలా ఉంటుంది ఆమె నడత.
ఆమె కళ్ళలో ఎప్పుడు ఎదో పోగొట్టుకున్నననే భాద ఉంటుంది. పవన్ కనపడినప్పుడల్లా తను పడ్డ భాదని చెప్పాలనే చూస్తుంది తన భావాలతో.

మామ
రావు రమేష్ గారు నిజంగా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసారు. ఆయన చెప్తుంటే మన మామ నిజంగా కష్టాల్లో ఉండి చెప్తున్నదేమో అనిపిస్తుంది.

  అత్తగారు మందలించినపుడు హిరో నడుస్తున్నప్పుడు దేవదేవం పాట బ్యాక్ గ్రౌండ్ రూపంలో వినిపిస్తూ ఉంటుంది. ఇది సరాసరి చేవులనోదిలేసి హృదయానికి వినిపిస్తూ ఉంటుంది, హిరో వచ్చిన పని యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ఉంటుంది.

ప్రతీ సీన్లో ఎదీ ఎక్కువ కాకుండా ఒక ప్రేక్షకుడిలా గమనించి చిత్రీకరించాడు త్రివిక్రమ్ . పవన్ ఎక్కడ మాట్లాడితే బాగుంటుందో ఎక్కడ మౌనంగా ఉంటె బాగుంటుందో ఎరిగి తదనుగుణంగా సన్నివేశాలను పొందు పరిచాడు. చివరాకరికి తను వచ్చిన పని పూర్తయిందన్న ఆనందంలో హీరో మోకాలిపై నవ్వుతు ఎన్నాళ్ళ భాద ఇన్నాళ్ళకి తీరిందనే భావాన్ని సున్నితంగా వ్యక్తపరుస్తాడు హిరో.

నేను గమించిన కొన్ని ఆసక్తికర విషయాలు.

  •  సినిమాలో కారు నెంబర్స్ AA, BB, CC , DD తో ఉంటాయి.
  • పవన్ వాళ్ళ అత్తతో క్లైమాక్స్ దాక మాట్లాడడు.
  • విమానం పైన నందాస్ అని రాసి ఉంటుంది.
  • పెద్దాయన వాళ్ళ కూతురితో కోపంగా మాట్లాడేటప్పుడు బయట హోమ మంత్రాలు వినిపిస్తుంటాయి. తర్వాత ఆ యుశ్యజ్ఞం అని మనకు తెలుస్తుంది.
  • మొదటి పాటలో చిన్న కథను రివర్స్ స్క్రీన్ ప్లే తరహాలో చూపిస్తారు.
  • నిన్ను చూడగానే పాటలో నిలువు చెక్కల అమరిక సెల్ ఫోన్ టవర్ తరహాలో ఉంటుంది
  • నదియ సినిమా మొత్తం ఒకసారే నవ్వుతుంది.
  • సినిమాలో ముఖ్య తారాగణం అంతా ఏడుస్తుంది.
  • సమంతా తన ప్రేమను పవన్ కి చెప్పే సన్నివేశం.
    • ఈ సీన్ చూడటానికి మామూలుగా కనిపించినా రొటీన్ గా ఉండదు. సమంతా నిన్ను ప్రేమిస్తున్నా అంటుంది మళ్ళి వెంటనే నీకు డబ్బులేదు అని చెప్పి ప్రేమించాను అని సిమ్ప్లేగా చెప్తుంది. సమంతా అలా చెప్పకపోయి ఉంటె ఓహో లవ్ సీన్ రా అనుకుని గమ్మున ఉండేవాళ్ళం. కాని ఇక్కడ అలా కాదు.కొంచం భిన్నంగా చూపించారు త్రివిక్రమ్. మద్యలో మళ్ళి వాళ్ళ అక్కకి సెటైర్ వేస్తుంది. ఇలా ప్రేక్షకుడు ఇది రొటీన్ సీన్ రా అనుకోకుండా చేసాడు త్రివిక్రమ్. ఇక్కడే అర్ధం అవ్తుంది దర్శకుడు ఒక్కో సీన్ ని ఎంత జాగ్రత్తగా తెరకెక్కించాడు అనేది.
ఇలా గమనిస్తూ ఉంటె చాలానే కనిపిస్తాయి  సినిమాలో.

మిగతా అంతా మీకు తెలిసిందే.

చివరిగా ....
త్రివిక్రమ్ సినిమాని ముందుగా ఒక ప్రేక్షకుడిలాగా ఫీల్ అయి ఆ తర్వాత సినిమాని తెరకెక్కించాడు. అందరు ఫ్యామిలి తో వెళ్తున్నారు సినిమాకి. ముసలాళ్ళు , సంవత్సరాలతరబడి సినిమాలు చూడటం ఆపెసినవాళ్లు కూడా ఈ సినిమా చూడాలని వస్తున్నారు.
ఈ సినిమా ఫామిలిస్ తో చూడటానికి ఇదే మంచి అవకాశం . నాకు ఒకటే ఆలోచన .. ఈ సినిమా మా ఇంట్లో వాళ్ళకి చూపించాలి. ఎప్పుడు నాకిలా ఏ సినిమాకి కూడా అనిపించలేదు. పవన్ కళ్యాణ్ కాకున ఎవరు చేసిన ఈ మూవీ హిట్ అవుతుంది. చాల మంచి సినిమా .ఈ అవకాశం కానీ ఇలాంటి సినిమాలు కానీ మళ్ళి మళ్ళి రాదు రావు . ఎందుకంటే ఇలాంటి సినిమాలు తీస్తే తెగింపు ఉండాలి. తీసే ధైర్యం, కంటెంట్ ఉండాలి. ఎప్పటికోస్తుందో తెలీదు కానీ ఇలాంటి సినిమా ఇప్పటికైతే మీ వాళ్ళకి చూపించండి.
ఈ సినిమా పవన్ కళ్యాన్ కక్రేజ్ వల్లనే హిట్ అయింది అంటే భాదేస్టది. ఇది గొప్ప సినిమా దర్శకుడు చాల బాగా తెరకెక్కించాడు.కోట శ్రీనివాసరావు గారు బాగా చెప్పారు ఈ విషయమై.
--సరిగ్గా పైరసీ వచ్చిన నెల రోజులకి చాలా గట్టి సమాధానం ఇచ్చారు అభిమానులు పైరసీకి. అత్తారింటికి దారేది ని ఇండస్ట్రీ హిట్ చేసారు.  పైరసీ అభిమానులముందు మోకరిల్లింది. సిగ్గుతో తల వంచుకుంది. 


జైహింద్ 








No comments :