Google Shades of my life: "Naannaku Prematho" - My Views

Monday, January 18, 2016

"Naannaku Prematho" - My Views

"రాజా రాణి నేపధ్య సంగీతం విన్నాక నా మనసు మంచి ఫీల్ తో ఉంటుంది...  ఆ ఫీల్ పోకముందే ఇష్టమైన అమ్మాయికి మనసులోని మాట చెప్పాలని I Love You చెప్తే...  అటునుండి సమాధానం రాదు..."   ఇది గుర్తు పెట్టుకోండి,  మళ్ళీ మాట్లాడుదాం దీనిగురించి.



సినిమా విషయానికొస్తే...
ఇంగ్లాండ్ లో ప్రసిద్ది చెందిన ధారావాహిక షెర్లాక్ హోమ్స్ ఆధారంగా సుకుమార్ హీరో క్యారక్టర్ డిజైన్ చేసారనిపిస్తుంది. అందుకే కాబోలు ఇంగ్లాండ్ లోనే చిత్రీకరణ జరిగింది.

ఇంటర్నెట్ ఇంటర్నెట్ లో రివ్యూలు చదివి ఈ క్యారెక్టర్ యం. టి. ఆర్ కి సెట్ కాదు అనుకున్నాను. కానీ  సరిపోయింది. తనకున్న నటనానుభవం కూడా పూర్తిగా పాత్రకు ప్రాణం పోసింది. వేషధారణ కూడా సరిపోయింది.

గమనిక: ఇక్కడ నుంచి కథ గురించి మాట్లాడటం జరుగుతుంది.

తండ్రి ప్రతీకారాన్ని పుత్రులు ఎలా తీర్చారనేది కధాంశం. హీరో పాత్రని తెలివైన యువకుడి' గా చిత్రీకరించారు. ఆవిధంగా వచ్చే సన్నివేశాలతో ప్రేక్షకులని కట్టి పడేయాలనుకున్నారు సుకుమార్. కొంత వరకు సఫలీకృతులయ్యారనే చెప్పాలి.

పాత్రల గురించి.
యం.టి.ఆర్ పూర్తి న్యాయం చేసారు. రకుల్ ప్రీత్ సినిమాకి తానే డబ్బింగ్ చెప్పింది. ఒక యన్. ఆర్ఐ మాతృ భాష మాట్లాడితే ఇలా ఉంటుందని చెప్పడానికి కాబోలు ఇలా చేసారు.  అందంగా ఉంది. డబ్బింగ్ సరిపోయింది. జగపతిబాబు బాగాచేసారు.

ఇలా తీసి ఉంటే బాగుండేది.
మొదటగా ప్రేమతో ప్రతీకారం ఎక్కడా అబ్బదు. ప్రేక్షకులు ఇక్కడ అంగీకరించకపోవచ్చు. తండ్రి మీద సానుభూతి ఏర్పడదు.  పెద్ద విషయం కాదిది.  D అంటే దివ్య అంటాడు మళ్ళీ మళ్ళీ అదే చెప్తాడు. ఆకరికి కూడా అదే చెప్పి ఉంటే బాగుండేది. అలా చేసుంటే హీరోయిన్ మీద ప్రేమతో ఉన్నట్టు నిజాయితీ గా ఉన్నట్లు కలిసొచ్చేది. ఇద్దర్ని తెలివిగా చూపిచ్చారు బాగానే ఉంది కానీ హీరోయిన్ ని కూడా తెలివిగా చూయించేసరికి ప్రేక్షకులకి ఓపిక పోతుంది. పాటలు సినిమాలో స్క్రీన్ ప్లేని అయోమయం చేసేలా ఉంటాయి.  పాటలు అవసరం లేదీ సినిమాకి. డాన్స్ బాగా చేసాడనుకోండి. రొటీన్ స్టెప్స్ లేవు.

మొదటకొస్తే నా ప్రేమ నిజం కావచ్చు కానీ ఆ అమ్మాయ్ కూడా అలా రాజారాణి వింటుండాలి కదా నేనేం అనుకుంటున్నానో, ఎలా ఫీల్ అవుతున్నానో తెలియాలంటే. నా శక్తి ఉన్నంత వరకు ప్రయత్నిస్తాను తెలియజేయడానికి. నేనిలానే ఉంటాను నా ప్రేమ ఇలానే ఉంటుంది. ఒకరోజు నీకు తెలిసి రావచ్చు. సుకుమార్ మంచి సినిమాని తీసారు తనకది తెలిసు , అర్దం చేసుకున్నవాళ్ళకు తెలుసు. అలాంటి సినిమాలు చూడాలంటే మనం సుకుమార్ పనితనం అర్థం చేస్కోవాలి. కాదు గీదు అనుకున్నా ఎవరో ఒకరు తనకి వస్తారు, మంచిగా చూస్కుంటారు. కానీ నాలా చూసుకోలేరు. ఎందుకంటే నేను చాలా బాగా చూుకుంటా. కావాలంటే సాధారణ సినిమాలకి మీ 100 రూపాయలు వెచ్చించవచ్చు. అద్భుతమైన అనుభవం పొందాలంటే అదే వెలలో నాన్నకు ప్రేమతో' సినిమా ఉంది.  తెలుగు సినిమా స్థాయిని పెంచే ప్రయత్నంలో సుకుమార్ గారు ఉన్నారు. వీలైతే భాగం పంచుకోండి. పంచుకోకున్నా పర్లేదు ఎందుకంటే కొన్నిటిని మనం ఆపలేం మన ప్రమేయం లేకుండా జరిగిపోతుంటాయ్.

No comments :